Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
'అన్నయ్య (చిరంజీవి) ఓ రోజు లంచ్‌కి రమ్మని పిలిచారు. వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. 'మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా ఉంది, నాకేం అర్థం కావడం లేదన్నయ్యా.. మీరు చేయమని చెప్తే చేసేస్తాను.. మీరు కథ చెప్పడం ఏంటి?'అన్నాను. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే పాత్ర చేస్తున్నపుడు అందులో ఉన్న లోతు కొంచెం కొంచెం అర్థమైంది. ఇందులో నా నటన గురించి అన్నయ్య ప్రశంసలు విన్నాను. దాని గురించి మాటల్లో చెప్పలేను. అన్నయ్య ఇందులోని నా నటనని ప్రశంసించడం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. నా కల నేరవేరింది. ఈ గాడ్ ఫాదర్ కథ అన్నయ్య గ్రేస్, ఆరాకి వందకి వంద శాతం సరిపడే కథ. మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. సీన్లు పేల్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ నా ఫేవరేట్. మాములుగా ఉండదు. మోత మోగిస్తుంది. 'థార్ మార్..' పాట కూడా అదిరిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో నాకు, అన్నయ్యకి 14 నిమిషాలు ఉన్న యాక్షన్ సీన్ హైలెట్. దీనికంటే మించి ఇందులో చాలా ఉన్నాయి. ఆద్యంతం ఎత్తుకుపై ఎత్తు అన్నట్టుగా ఉంటుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన సూపర్ కూల్. సెట్స్‌లో చాలా సింపుల్‌గా, సరదాగా ఉన్నారు. దర్శకుడు మోహన్ రాజా కూడా చాలా కూల్ పర్సన్. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ప్రతి పాత్రని అద్భుతంగా డిజైన్ చేసుకుంటారు. ఇందులో నా పాత్రని చాలా స్టయిలీష్, పవర్ హంగ్రీ, గ్రీడీ ఇలా చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇలాంటి పాత్రని ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్ర చాలా అద్భుతంగా వచ్చింది' అని సత్యదేవ్ చెప్పారు.