Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం 'లెహరాయి'. రామకృష్ణ పరమహంసని దర్శకుడిగా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రమిది.
'ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమస్ కావటం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్‌కు, సాంగ్స్‌కు విశేష స్పందన లభించింది. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన 'గుప్పెడంత..' సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సక్సెస్‌ని పురస్కరించుకుని ఈ చిత్రం నుండి 'అప్సరస అప్సరస' అంటూ సాగే మరో సాంగ్‌ను కూడా విడుదల చేశాం. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ అద్భుతంగా ఆలపించారు. 'తీపితో తేల్చి చెప్పా..తొలితీపి నీ పలుకని..తారనే పిలిచి చూపా..తొలి తారా నీ నవ్వని' లాంటి లైన్స్ మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. మంచి ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని దర్శకుడు రామకృష్ణ పరమహంస తెలిపారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస, మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ), డి.ఓ.పి : ఎం.ఎన్.బాల్ రెడ్డి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఫైట్ మాస్టర్ : శంకర్, కొరియోగ్రాఫర్స్ : అజరు సాయి, రైటర్ : పరుచూరి నరేష్.