Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో 'దాదా సాహెబ్ ఫాల్కే' ముఖ్యమైనది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2020 సంవత్సరానికి ఈ అవార్డుకు బాలీవుడ్ నటి, ఆశా పరేఖ్ ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుకలో భాగంగా ఈనెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆశా అందుకోనున్నారు. 1952లో 'మా' చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయిన ఆశాకు 'దిల్ దేకే దేఖో', 'ఘరానా', 'జిద్దీ', 'లవ్ ఇన్ టోక్యో', 'తీస్రీ మంజిల్', 'భరోసా' వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు కథానాయికగా మంచి గుర్తింపునిచ్చాయి. అభిరుచిగల దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పేరొందిన ఆశాకు 1992లో పద్మశ్రీ పురస్కారం లభించింది.