Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తున్న చిత్రం 'కాఫీ విత్ ఏ కిల్లర్'. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, 'చాలా ఎంటర్టైనింగ్గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజారు చేశాను. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్.పినే హీరో అనిపించింది' అని అన్నారు. దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ, 'ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ సినిమా చేశాం. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో రివీల్ చేస్తాం. ఒక డిఫరెంట్, న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ''ఆర్.పి ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా. ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన గౌతమ్ పట్నాయక్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంతదాకా వచ్చేది కాదు.ఆర్.పితో మరో రెండు ప్రాజెక్ట్ చేస్తున్నా' అని నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ చెప్పారు.