Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో వైభవంగా జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు, మెగా అభిమానులు హాజరైన ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఈ వేడుక విజయ వంతమవ్వడం విశేషం.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ'నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా అనిపిస్తుంది. మలయాళంలో విజయం సాధించిన 'లూసిఫర్' సినిమాని చూశాను. ఇది 'గాడ్ ఫాదర్'గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది. నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్ చరణ్ ముందుకు వచ్చి 'మీ ఇమేజ్‌కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ ఇది' అని చరణ్ చెప్పాడు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణ్‌నే. మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. అయితే ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా ఉండే ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని చాలా సింపుల్‌గా చెప్పారు. మరి సల్మాన్ ఖాన్ని తీసుకురావడం సాధ్యమేనా అని ఆలోచిస్తున్నపుడు రామ్ చరణ్ ఆ భాద్యత తీసుకున్నారు. 'నేను చేయాలని చిరు కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా సెట్కిి వచ్చేస్తా' అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భారుకి కృతజ్ఞతలు. చరణ్ తో కలిసి సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్బి చౌదరి గారు, ఎన్వి ప్రసాద్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్ర ఇది. చాలా అద్భుతంగా చేశాడు. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు. ఇందులో దర్శకుడు పూరి జగన్నాథ్ యూట్యూబర్‌గా కనిపించి పాత్రలని, కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్‌నెస్ వస్తుంది. గాడ్ ఫాదర్‌కి ఆరో ప్రాణం తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళింది. కేవలం కంటిచూపుతోనే గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. తమన్ చాలా అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి' అని చెప్పారు.