Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్‌గా నటించారు. జి. నాగేశ్వర్ రెడ్డి ముల కథ అందించారు. కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చటంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సూర్య మాట్లాడుతూ, 'నేను మోహన్ బాబు గారి సంస్థలో సినిమా చేస్తానని అనుకోలేదు. ఈ చిత్రం మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. పెద్ద హిట్ అవుతుంది' అని తెలిపారు. 'ఈ చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న విడుదల అవుతుంది. విష్ణు కెరీర్లో ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అని బ్లాక్ బస్టర్లే. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. దర్శకుడు సూర్య చాలా బాగా చేశాడు. ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్‌తో సినిమా చేయటం కష్టం. నేను ఈ సినిమాకి దర్శకత్వం చేయడం లేదని బాధపడను. మోహన్ బాబు బలమే మహిళా ప్రేక్షకులు, మాస్ ప్రేక్షకులు. ఈ చిత్రం మహిళలకి సూపర్‌గా నచ్చుతుంది' అని దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ, 'ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల అవుతుంది. మా అందరికి ఇదొక అద్భుతమైన జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది. దీపావళి కానుకగా ఓ మంచి సినిమాని అందిస్తున్నాం' అని చెప్పారు.