Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'లాట్స్ ఆఫ్ లవ్'. నేడు (శుక్రవారం) ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ సందర్బంగా మీడియాతో దర్శక, నిర్మాత డా. విశ్వానంద్ పటార్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగా, కథ, మాటలు, మ్యూజిక్ చేశాను. ఇప్పుడు వస్తున్న సినిమాలను భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేమ అంటే కేవలం ఇద్దరి ప్రేమికుల మధ్య ఉన్నదే కాదు ప్రేమ అనేది అనేక రకాలుగా ఉంటుందని ఈ సినిమా ద్వారా తెలియ జేస్తున్నాం. భిన్న ప్రేమకథల సమాహారంగా రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.