Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రీ,కొడుకుల మధ్య జరిగే రైవల్రీ కథే 'లోకమెరుగని కథ'. సుజాత సమర్పణలో క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజిత హీరోయిన్. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో గ్రాండ్‌గా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసింది.
చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ, 'అవకాశం ఇచ్చిన నిర్మాత రవికాంత్ జమికి ధన్యవాదాలు. ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే లవ్, మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి, ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టు నడుచుకునే కొడుకుల మధ్య వినూత్న స్క్రీన్‌ప్లేతో జరిగే రైవల్రీ కథే ఈ సినిమా. ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ పాటలను కాల భైరవ, సత్య యామిని వంటి ప్రముఖ సింగర్స్ పాడారు. సరిగమ తెలుగు ద్వారా ఈ పాటలు రిలీజ్ అవుతాయి. అందరి సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది' అని చెప్పారు.
'ఇది నా మొదటి చిత్రం. నా పాత్రకు మంచి పేరు వస్తుంది. మా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని హీరోయిన్ పూజిత మాట్లాడుతూ అన్నారు.