Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాయగూరల సాయిశరణ్, పల్లవి, ట్రాన్సీ హీరో, హీరోయిన్లుగా శ్రీనివాస్ జిఎల్బి దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్న చిత్రం 'ఐక్యూ'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, అనంతపూర్‌లో జరిగింది. ఈ సినిమా టీజర్ ఫస్ట్‌లుక్, పోస్టర్ విడుదల వేడుక విజయవాడలో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వీటిని ఆవిష్కరించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బోండా ఉమామహేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యాస్, అమ్మిశెట్టి వాసుతో పాటుగా చిత్ర బృందం పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యూత్ మెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం' అని దర్శకుడు శ్రీనివాస్ జిఎల్బి తెలిపారు. సుమన్, సత్యప్రకాష్, సూర్య, గీతాసింగ్, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం: ఘటికాచలం, ఛాయాగ్రహణం: టి.సురేంద్రరెడ్డి.