Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ది ఘోస్ట్'. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ మాదిరిగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
రిలీజ్ ట్రైలర్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ,'నారాయణ్ దాస్ నారంగ్‌కి నాతో సినిమా తీయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైంది. నిర్మాతలు సునీల్ నారంగ్ పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌కి కతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో తీశారు. ఈ సినిమాని ఒక కసితో తీశాం. ఇందులో సాంకేతిక విలువలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. దర్శకుడు ప్రవీణ్‌తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్‌ని కూడా ప్రవీణ్ అద్భుతంగా కట్ చేశారు. ఒక కాన్సెప్ట్‌తో ఉన్న కంటెంట్ ఇది. ఈ సినిమా కోసం మేమంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. సాంకేతిక నిపుణుల, నటీనటులు పనితనం గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అనంతపురం ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మా సినిమాకి బెస్ట్ విషెస్ అందించడం చాలా అనందంగా ఉంది. ఆయనకి కతజ్ఞతలు. విడుదల అవుతున్న అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి' అని చెప్పారు.
'ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. ఇందులో నాగార్జున ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్‌ని ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మేం ఫైనల్ కాపీ చూసుకున్నపుడు ఎంత ఎగ్జైట్ అయ్యామో ఆ ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. విజయదశమి రోజు మా సినిమా వస్తోంది. మీ అందరి మనసులను గెలుచుకుంటుంది. బిగ్ స్క్రీన్ పై సినిమాని ఎంజారు చేయాలి' అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు.
నాయిక సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ,' ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో నాకు నాగార్జునతో యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో చేయడం అనందంగా ఉంది. నన్ను ఇలాంటి యాక్షన్ రోల్లో ప్రేక్షకులు ఇప్పటివరకూ చూడలేదు. ఈనెల 5న మాచిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజారు చేస్తారని కోరుకుంటున్నాను' అని తెలిపారు. సునీల్ నారంగ్, జాన్వి, అదిత్ మరార్ ఈ వేడుకలో పాల్గొని చిత్ర విశేషాలను తెలియజేశారు.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్‌తో కలిసి పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.