Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా 'మది'. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా, ఆర్.వి.రెడ్డి సమర్పణలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. నాగ ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
నయా రొమాంటిక్ లవ్ స్టొరీగా రాబోతున్న ఈ సినిమా ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ఉంటూ, వినూత్న రీతిలో కథనం సాగుతుంది. సందర్భానుసారంగా ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఈ పాటలను ఆలపించారు. వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించనుందని నిర్మాత రామ్ కిషన్, సహ నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి తెలిపారు. రామ్ కిషన్, శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-కథనం-మాటలు-దర్శకత్వం: నాగ ధనుష్, కెమెరామెన్: విజయ్ ఠాగూర్, ఆర్ట్: విజయ్, ఎడిటర్: ప్రదీప్. జంబిగ, లిరిక్స్: కడలి, పూర్ణ చారి.