Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శనివారం పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ నేతృత్వంలో, చిరంజీవి ముఖ్య అతిథిగా అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో కొత్త ఫిల్మ్ స్టూడియో 'అల్లు స్టూడియోస్' ను ప్రారంభించారు.
ఈ శతజయంతి వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ, 'ఎంతో మంది నటులు ఉన్న కొందరికి మాత్రమే ఈ రకమైన ఆత్మీయత, అభిమానం లభిస్తుంది. రామలింగయ్య వేసిన బాటలో అల్లు అరవింద్ నిర్మాతగా, అల్లు అర్జున్, అల్లు శిరీష్ నటులుగా ఈరోజు అగ్రస్థానంలో ఉన్నారంటే దానికి కారణం కొన్ని దశాబ్దాలు క్రితం అల్లు రామలింగయ్య మదిలో నటుడిగా నిలద్రొక్కుకోవాలి అనే ఒక ఆలోచన. అల్లు అరవింద్‌ని నిర్మాతను చేయాలని గీతా ఆర్ట్స్ స్థాపించారు. ఈ అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం చేసింది అని నేను అనుకోవట్లేదు. ఇది ఒక స్టేటస్ సింబల్. ఇది అల్లు రామలింగయ్యకి ఘనమైన గుర్తింపు' అని చెప్పారు. 'ఈ స్టూడియో అనేది ఎంత లాభాన్ని తీసుకొస్తుంది?, ఎంత వ్యాపారం అనే దృక్పథంతో కట్టలేదు.ఈ స్టూడియో తరాలుగా ఉండిపోయే ఒక జ్ఞాపిక' అని అల్లు అరవింద్ తెలిపారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ,'ఈ స్టూడియో పెట్టిన పర్పస్ మాకేదో కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందని కాదు, ఈ స్టూడియోస్ పెట్టడానికి కారణం ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకంగా ఇది నిర్మించాం. ఇక్కడ మంచి మంచి సినిమాల షూటింగ్స్ జరగాలని కోరుకుంటున్నాను. అలానే కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మెగా అభిమానులకు, నన్ను ప్రేమించే నా ఆర్మీకి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు' అని అన్నారు.