Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్‌తో కలిసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
పవర్ఫుల్ క్యారెక్టర్
ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటెలిజెన్స్ ఫీల్డ్‌లో ఈ పదానికి ఒక పవర్ ఉంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్. నా కెరీర్లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. నాగార్జున ఇంటెన్సిటీ, స్టయిల్, గ్రేస్, ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా డిజైన్ చేసి ఈ కథ రాశాను. తక్కువగా మాట్లాడి బలమైన యాక్షన్స్‌తో ఇంపాక్ట్ చూపే విధంగా ఉంటుంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషన్ ఉంటుంది.
12 యాక్షన్ సీక్వెన్స్‌లు
కథ రాసుకున్నపుడు ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్ట్టోరీ రాస్తాం. అలాంటి బ్యాక్ స్టోరీ ఉన్నపుడే పాత్రకు బలం చేకూరుతుంది. నాగార్జున ఇందులో 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అయితే ఈ జర్నీలో ఆయన చాలా మిషన్స్‌లో పాల్గొని ఉంటారు. అలా తన జర్నీలో జపాన్ వెళ్లినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటలే తమహగనే. ఇదొక కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ. 12 యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులకు అడ్రినల్ రష్ ఇచ్చే సినిమా. సోనాల్ చౌహాన్ చాలా అంకిత భావంతో పని చేసే నటి. మాకు చాలా సమయం ఇచ్చి, చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇందులో బ్రిలియంట్ ఫెర్ఫార్మ్ చేసింది.
చాలా సార్లు విజిల్స్ వేస్తారు
హై ఎమోషన్స్ హీరోయిజం ఉన్న చిత్రమిది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. విజిల్స్ వేసే మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. క్లాస్‌గా తీసిన పక్కా మాస్ ఫిల్మ్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
ఎలాంటి పోటీ లేదు
అయితే 'ది ఘోస్ట్' విడుదల రోజునే చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూడా రిలీజ్ అవుతోంది. పోటీ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఇందులో పోటీ లేదు. రెండు భిన్నమైన సినిమాలు. బాగుంటే ప్రతి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను. ఇటీవల జరిగిన 'గాడ్‌ఫాదర్' ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున నటించిన 'దిఘోస్ట్', సితార ఎంటర్టైన్మెంట్స్ 'స్వాతిముత్యం' సినిమాలు కూడా బాగా ఆడాలని విషెస్ అందించడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్‌తో సినిమా ఈనెల 10 నుండి యూకేలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక వెబ్ సిరిస్ ప్లాన్ కూడా ఉంది.