Authorization
Mon Jan 19, 2015 06:51 pm
113వ జయంతి సందర్బంగా లెజెండరీ నటుడు పైడి జైరాజ్ జయంతి వేడుకలు ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో నటుడు పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, 'తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్లో నిలదొక్కుకున్న తెలంగాణ నటుడు పైడి జైరాజ్. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి, ఆ తర్వాత దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం మనందరికీ నిజంగా గర్వకారణం. అయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి. రియల్ హీరోగా ఎదిగిన అయన మనందరికీ ఆదర్శం. ఆయన 113వ జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ పరిధిలో అయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఛాంబర్ అధ్యక్షులకు కోరాం. రాష్ట్ర గవర్నమెంట్ పైడి జైరాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి. కరీంనగర్‌కు పైడి జైరాజ్ పేరు ప్రకటించాలి. నంది అవార్డ్స్ ఎలా ఉన్నాయో పైడి జైరాజ్ పేరుతో అవార్డ్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం' అని అన్నారు. 'సర్దార్ పాపన్న' హీరో వంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ, 'తెలంగాణకు చెందిన పైడి జైరాజ్ గొప్ప నటుడు. అయన 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి. అయన జీవితం మనందరికీ ఆదర్శం. అలాంటి వ్యక్తి గురించి తెలుగు పరిశ్రమ మరచిపోయిందని తెలిసి నేను గత 14 ఏళ్ళ నుండి నా సొంత ఖర్చులతో అయన చరిత్రను తెలియజేస్తూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాను' అని చెప్పారు.