Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ పలు కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా శనివారం జరిగిన శతజయంతి వేడుకలకి రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ (అల్లు రామలింగయ్య కుమార్తె), అలాగే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అల్లు రామలింగయ్యపై రాసిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, తొలి ప్రతిని చిరంజీవికి అందించారు. ఈ వేడుకలో బ్రహ్మానందం మాట్లాడుతూ,'అల్లు రామలింగయ్యకి బతుకు విలువ, మెతుకు విలువ తెలుసు కాబట్టి ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో ఆయనకి తెలుసు. అల్లు అరవింద్ లాంటి బిడ్డను కన్నందుకు ఆయన ఎంతగానో ఆనందిస్తారు. ఆయన ఎప్పటికి మన మధ్యలోనే ఉంటారు' అని అన్నారు.
'అల్లు రామలింగయ్యకి సినీపరిశ్రమలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు. ఆయనకు అల్లుడుగా వచ్చి ఆయన స్థాయిని ఎన్నో రేట్లు పెంచిన చిరంజీవికి ప్రత్యేక కతజ్ఞతలు. అలానే పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి, పుస్తకాన్ని రాసిన వారికి ధన్యవాదాలు' అని అల్లు అర్జున్ చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ, 'అల్లు రామలింగయ్యతో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన్ని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో చాలా మంది ఉండగా ఆయన నా వైపే పదే పదే చూస్తూ నన్ను గమనించడం చేసేవారు. ఆ సమయంలో నాకు ఆయన ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు. ఆయన కూతురు సురేఖని ఇచ్చి నాకు పెళ్ళి చేయబోతున్నారని ఆ తర్వాత అర్థమైంది. ఆయనొక నిరంతర విద్యార్థి, చిరస్మరణీయుడు. ఆయన మరణించలేదు మన మధ్యే ఉన్నారు' అని తెలిపారు. 'అల్లు రామలింగయ్య పుస్తకావిష్కరణలో పాల్గోవడం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన పిల్లందరికి నా ఆశీర్వచనాలు, ఆయనకు నా నివాళులు. సినిమాలలో ఉన్నత విలువలు, కొన్ని సంప్రదాయాలు నిలబెట్టిన వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు. ఏ విధమైన అసభ్యత లేకుండా, కేవలం తన హావభావాలతో నవ్వించగల నటులు అల్లు రామలింగయ్య' అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ,'అల్లు రామలింగయ్య వారసత్వం ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఊహించడం కూడా వధా, వారి వారసత్వం రాబోయే తరాలు నిలిచి పోతుంది. రాబోయే తరాలు కూడా ఆయన గొప్పతనాన్ని నిలుపుతాయి. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌తో పాటు చిరంజీవి ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆయన ఒక మార్గ నిర్దేశం చేసి వెళ్లారు. ఇప్పుడు ఆ మార్గంలో అద్భుతమైన జర్నీని వారు కొనసాగించడం అభినందనీయం' అని అన్నారు.
ఇదే వేడుకలో అల్లురామలింగయ్య స్మారక పురస్కారాలను బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్, ఎల్.బి.శ్రీరామ్, రావురమేష్, పృథ్వీరాజ్, వెన్నెల కిషోర్‌కి అందజేశారు. ఈ వేడుకలో సాయిధరమ్‌తేజ్, రామ్‌చరణ్, అల్లుఅరవింద్, అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు.