Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గాఢ్‌ఫాదర్' హిందీ చిత్ర ట్రైలర్ లాంచ్‌లో సల్మాన్‌ఖాన్
చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఈనెల 5న దసరా కానుకగా తెలుగు, హిందీల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'గాడ్ ఫాదర్' లో ఒక బలమైన పాత్ర ఉంది. 'లూసిఫర్'లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. 'గాడ్ ఫాదర్'లో ఈ పాత్రని సల్మాన్ భారు చేస్తే బావుంటుందని భావించాం. మేం కోరగానే 'నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భారు. సల్మాన్ భారు ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్‌లోనూ మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భారు 'గాడ్ ఫాదర్'లోకి రావడం ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్‌తో కలిసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్‌గా చేశాను. ఆ జోష్ ని తెరపై చూస్తారు' అని అన్నారు 'సినిమాల పట్ల చిరంజీవికి, మాకున్న ప్రేమే ఈ సినిమాలో నేను నటించటానికి కారణం. ఆయనతో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. సినిమాలని నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. ఇకపై నేను దక్షిణాది చిత్రాల్లోనూ నటిస్తా. దీంతో మన కలెక్షన్లు వేల కోట్లలో ఉంటాయి' అని సల్మాన్‌ఖాన్ చెప్పారు.