Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వెంకటేష్ వుప్పల సంగీత సారథ్యంలో సుమంత్ బొర్ర నిర్మాణంలో వచ్చిన పాట 'పడిపోయా' ఉపేంద్ర కుమార్, వైష్ణవి రెడ్డి నటించిన ఈ పాట ప్రేక్షకులతోపాటు మెహర్ రమేష్, తరుణ్ భాస్కర్, గీతా భాస్కర్, గాయకుడు దీపు వంటి పరిశ్రమ ప్రముఖులనూ ఫిదా చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటని సుమంత్ బొర్ర ఆలపించారు. అటు సినిమా పాటలు, ఇటు ఆల్బమ్ సాంగ్స్ శ్రోతల్ని, ప్రేక్షకుల్ని ఆయన ఊర్రూతలూగిస్తున్నారు. 'పడిపోయా..' పాటకి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ వుప్పల మాట్లాడుతూ, 'లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఒక బ్యాండ్ ఏర్పాటు చేసి, అక్కడ నేను, సుమంత్ బొర్ర ఇద్దరం కలుసుకున్నాం. మేమిద్దరం 2014 నుంచి చాలా ప్రాజెక్ట్స్ చేశాం. వీటిల్లో ముఖ్యంగా 'ఏలా మరి ఇక రావా', ఇప్పుడు 'పడిపోయా' పాట ద్వారా మాకు మరింత మంచి గుర్తింపు వచ్చింది. కొత్తదనం ఉండేలా కంపోజ్ చేస్తే, పాటలోనూ ఆ కొత్తదనం కనిపిస్తుంది. ఆల్బమ్ సాంగ్స్ పాటు రెండు సినిమాలకి సైతం వర్క్ సంగీతం అందిస్తున్నాను' అని తెలిపారు. 'తెలుగు, దక్షిణాది సంగీత పరిశ్రమలో పాశ్చాత్య టచ్‌ని తీసుకురావాలనే స్పష్టమైన లక్ష్యాలతో సంగీత విజయం సాధించామని అనుకుంటున్నాం.
పరిశ్రమకు వచ్చాం. మా అభిరుచిని కళలోకి తీసుకురావడంలో రొటీసికి భిన్నంగా ఉండాలని మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ వుప్పల కొత్తగా ఆలోచిస్తూ, తన మార్క్‌ని క్రియేట్ చేశారు. మూడు సంవత్సరాల నుండి ఆదిత్య మ్యూజిక్ తో కలిసి పని చేశాం. 'పడిపోయా' పాటని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని సింగర్ సుమంత్ బొర్ర అన్నారు.