Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం 'లెహరాయి'. రామకృష్ణ పరమహంసని దర్శకుడిగా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రమిది.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన 'గుప్పెడంత' సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సక్సెస్‌కి కొనసాగింపుగా ఈ చిత్రం నుంచి తాజాగా 'బేబీ ఒసేయ్ బేబీ' అనే మరో సాంగ్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటని సాకేత్, కీర్తన శర్మ అద్భుతంగా ఆలపించారు. 'గాడి మీద కూసోబెట్టి ఊరు మొత్తం తిప్పుతుంటే జోడి మస్తు గున్నదంటూ సూసినోళ్లు మెచ్చబట్టే...' లాంటి లైన్స్ మరోసారి కాసర్ల శ్యామ్ మార్క్‌ను గుర్తు చేశాయి. 'ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. సంగీత దర్శకుడు జీకే (ఘంటాడి కృష్ణ) అద్భుతమైన సంగీతం అందించారు. మంచి ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాం' అని దర్శకుడు తెలిపారు.