Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్‌గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్యలక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను. సితార లాంటి పెద్ద సంస్థలో ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 'విక్కీ డోనార్' చిత్రానికి, ఈ చిత్రానికి కథాంశం పోలిక మాత్రమే ఒకటి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కథనం భిన్నంగా సాగుతుంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా కొత్తగా ఉంటుంది.
- కథానాయిక వర్ష బొల్లమ్మ