Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'నవాబ్'.
ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం 2గా ఆర్ఎం నిర్మిస్తున్నారు. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'నవాబ్' మూవీ క్యారెక్టర్ ఇంట్రో సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ, 'నా మొదటి సినిమా 'నల్లమల'. ఇదొక కొత్త తరహా ప్రయత్నం. పూర్తిగా డంపింగ్ యార్డ్‌లో సాగే కథ ఇది. నవాబ్ క్యారెక్టర్స్ ఇంట్రో మీకు నచ్చిందని అనుకుంటున్నాం' అని చెప్పారు. 'సినిమా వైవిధ్యంగా ఉంటూ మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది' అని హీరో ముఖేష్ గుప్తా అన్నారు. సినిమాటోగ్రాఫర్ రమేష్ కేఆర్ మాట్లాడుతూ, 'ఒరిజినల్ డంప్ యార్డ్‌లో షూటింగ్ చేయడం కష్టం. దీని కోసం 10, 12 ఎకరాల్లో ఒక డంప్ యార్డ్‌ను సెట్‌లా క్రియేట్ చేశాడు దర్శకుడు. అలాగే దీనికోసం వర్క్ షాప్స్ పెట్టాడు' అని అన్నారు.