Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రసమయి బాలకిషన్ 'రుద్రంగి' టైటిల్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
సోమవారం 'రుద్రంగి' ఫస్ట్ లుక్‌ని, టైటిల్ మోషన్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేశారు. ఇందులో జగపతి బాబుని జాలీ దయలేని భీమ్ రావ్ దొరగా పరిచయం చేశారు. ఉత్కంఠ పెంచే నేపథ్య సంగీతంతో 'రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ' అని జగపతి బాబు చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. కంటెంట్ ఉన్న కథతో నిర్మాతలు ఈ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులతో నిర్మిస్తున్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజరు సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్‌కి ఫస్ట్‌లుక్‌కి అనూహ్యమైన స్పందన రావడంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.