Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా బాలు శర్మ దర్శకత్వం వహించిన చిత్రం 'నీతో'. పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాని ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుండి 'లలనా మధుర కలనా' అనే లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
వరుణ్ వంశి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. 'అలుపై, మలుపై, ఎదురై ఆదమరించింది గమననా..గెలుపై మెరుపై మెరిసేనా గగనములై..' లాంటి లైన్స్ పాటలోని మంచి పొయిటిక్ ఫీల్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తుంది.
ఈ చిత్రానికి వివేక్‌సాగర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రానికి సుందర్ రామకృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రేక్షకుల మెప్పించే కథతో, ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.