Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 5న దసరా కానుకగా తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మోహన్ రాజా మీడియాతో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
'దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేయడం చాలా అనందంగా ఉంది. ఈ 'గాడ్ ఫాదర్' అవకాశం నిర్మాత ఎన్వీ ప్రసాద్ వల్ల వచ్చింది. ఈ సినిమా కోసం చిరంజీవిని కలిసే ముందే 'లూసిఫర్'ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరుతో పంచుకున్నాను. ఆ కోణం ఆయనకు చాలా బాగా నచ్చింది. కథని అలానే ఉంచి, ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. ఈ స్క్రీన్ ప్లే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. ఈ పాత్రలు చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఇందులో ట్రిక్కి విలన్ పాత్ర ఉంది. చక్కగా ఫెర్ ఫార్మ్ చేసే విలన్ కావాలి. దాని కోసం సత్యదేవ్‌ని తీసుకున్నాం. సినిమా చూసిన తర్వాత సత్యదేవ్ పాత్రే అందరికీ గుర్తుంటుంది అని చిరు అన్నారు. 'లూసిఫర్'లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ని ఎంచుకోవడానికి కారణం ఆ పాత్ర తాలూకా పవర్. ఇందులో హీరో పాత్ర సర్వాంతర్యామి. ఎవరు ఏం గేమ్ ఆడిన ఆయన ఆడే నాటకంలో పాత్రధారులే అంతా. అలాంటి పాత్ర కోసం చెప్పడానికి ఒక పెద్ద స్టార్ కావాలి. సల్మాన్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతుంది. ఆయన కొన్ని సీన్స్ చూసి, హ్యాపీగా ఫీలయ్యారు. 'గాడ్ ఫాదర్ 2' ఉంటుందా అని అడుగుతున్నారు. మలయాళంలో 'లూసిఫర్ 2' మొదలైంది. ప్రస్తుతం నా దృష్టి మాత్రం 'గాడ్ ఫాదర్' పైనే ఉంది. అయితే 'గాడ్ ఫాదర్' సీక్వెల్ కి మంచి కంటెంట్ ఉంది. అలాగే 'తని వరువన్' సీక్వెల్ ఆలోచన కూడా ఉంది' అని మోహన్‌రాజా చెప్పారు.