Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.
సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్‌తో కలిసి పుస్కుర్ రామ్మోహనరావు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహనరావు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, 'ప్రవీణ్ సత్తారు స్టయిలీష్ మేకింగ్‌లో నాగార్జున ఇందులో మునుపెన్నడూ లేని సరికొత్త యాక్షన్ స్లీక్ లుక్‌లో కనిపిస్తారు. గ్రేట్ ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న కంప్లీట్ మాస్ మూవీ ఇది. సినిమా అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ నుండి ఒక్క సెకన్ కూడా చూపు తిప్పుకోలేం. ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నాం. దసరా నాడే చిరంజీవి గాడ్ ఫాదర్ రిలీజ్ కూడా ఉంది కదా అని చాలా మంది అడుగుతున్నారు. సంక్రాంతిలానే దసరా కూడా సినిమా పండగ. రెండు పెద్ద సినిమాలు రావడం ప్రేక్షకులకు సినిమా పండగలా ఉంటుంది. అలాగే నాగార్జున ట్రెండ్ సెట్టర్ 'శివ' సినిమా కూడా అక్టోబర్ 5 విడుదలైంది. ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా ఈనెల 5న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడాని సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.