Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరణ్ హీరోగా, కరిష్మా హీరోయిన్గా చరణ్ రోరి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'రోరి'. సిటిఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈచిత్రాన్ని దర్శకత్వం చేస్తూ హీరోగా నటిస్తున్నారు చరణ్ రోరి. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై ఫుల్ యాక్షక్ విజువల్స్‌తో, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది.
చరణ్ ఓ విభిన్న పాత్రలో నటించాడు. అంతేకాదు టీజర్లో
ఓ ఇన్విస్టిగేషన్ చేసే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. గెటప్ కూడా కామన్ పర్సన్‌గా ఉంది. 'సీతారామం' సినిమా చేసిన లొకేషన్స్‌లో చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా చరణ్ రోరి మాట్లాడుతూ, 'ఈ చిత్ర మొదటి లుక్ టీజర్‌ని విడుదల చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఓ కుర్రాడి కథ. అనుకోని పరిస్థిఉల్లో ఆ కుర్రాడు పాకిస్తాన్‌కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కొంతమంది హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది ఈ చిత్ర కథ. అసలు హైదరాబాద్‌కి, పాకిస్తాన్‌కి మధ్య సంబంధం ఏంటి అనేది ఈచిత్రంలో ఆసక్తికర పాయింట్. ఈ చిత్ర కథనం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది' అని చెప్పారు.