Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాన్ ఇండియా స్టార్ హీరో యష్ నటించిన చిత్రం 'రారాజు'. కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఈనెల 14న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్మాత వి.ఎస్.సుబ్బారావు మాట్లాడుతూ, 'యష్, అయన సతీమణి రాధిక పండిట్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కన్నడలో పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'రారాజు' పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు, లిరికల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందర్నీ మెప్పిస్తుంది' అని అన్నారు.
కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: హరికృష్ణ, డీ ఓ పి : ఆండ్రూ, డైరెక్టర్ :మహేష్ రావు.