Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, 'నాంది' సినిమా ఫేమ్ నవిమి గాయక్ జంటగా రామనృష్ణార్జున్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'అభిరామ్'. జింకా శ్రీనివాసులు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి ఇటీవల యుట్యూబ్లో విడుదల చేసిన 'సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల - ఓ సైదులో సైదులా నా గుండె గుంజు కెళ్లే' లిరికల్ సాంగ్‌కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్బంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిర్మాత జింకా శ్రీనివాసులు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
యూత్‌కు కిక్కేక్కించేలా చాలా హుషారుగా ఉన్న ఈ పాటకు సాగర్ నారాయణ లిరిక్స్ అందించగా, మీనాక్షి భుజంగ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఉమా నేహా, సింహ చాలా చక్కగా ఆలపించిన ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ హీరో, హీరోయిన్స్‌తో చక్కటి నృత్యాన్ని చేయించారు. లవ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ కలయికతో ఒక విన్నూత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ చిత్రంలోని పాటలను టిప్స్ ఆడియో ద్వారా రిలీజ్ అవుతున్నాయని నిర్మాత చెప్పారు.