Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కాంబి నేషన్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించారు.
తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్బిచౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ మీడియాతో మాట్లాడారు.
'ఈ దసరాకి 'గాడ్ ఫాదర్'తో విజయం అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ హీరో హిట్ సెంటిమెంట్ ఉంది. నేను తొలిసారి కలిసి పని చేసిన హీరోలందరి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. మహేష్ బాబుతో దూకుడు, రవితేజతో కిక్, ఎన్టీఆర్‌తో బందావనం, పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్, బాలకష్ణతో అఖండ.. ఇలా అన్నీ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు చిరంజీవితో నేను చేసిన తొలి సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడం సెంటిమెంట్ కొనసాగినట్లైంది. మెగాస్టార్‌కి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. సినిమా చూసిన ప్రేక్షకులు సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఒక యూనివర్సల్ బాస్ ఫీలింగ్ సౌండ్ రావాలి. లండన్‌లో ప్రతిష్టాత్మక అబేరు రోడ్ స్టూడియోస్‌లో ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాం. ఆ స్టూడియో అందరికీ ఇవ్వరు. అక్కడ రికార్డ్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఈ సినిమానే. 'లూసిఫర్' చూసినప్పుడే ఇందులో పాటలకు స్కోప్ లేదని అర్థమైంది. కానీ ఆ ప్లేస్ మెంట్స్‌ని పట్టుకోవడంలోనే నాకు, దర్శకుడు మోహన్ రాజాకి పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇందులో హై పాటలకు అవకాశం లేదు. కథని నడిపే పాటలు కావాలి. షూటింగ్ మొత్తం పూర్తి చేసి సినిమా చూపించారు. తర్వాత నేను, రాజా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ కూర్చుని పాటల ప్లేస్ మెంట్స్, సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. నేను చిరంజీవికి ఒక ఫ్యాన్ బారుగా పని చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ అనేది సెకండరీ. ఈ సినిమా చూసి చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్స్ మర్చిపోలేను. మరో కమర్షియల్ సినిమా చేద్దామని ఆయన్ని అడిగాను. తప్పకుండా చేద్దామని మాటిచ్చారు (నవ్వుతూ).' అని చెప్పారు.