Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీపుట్టపర్తి సత్యసాయిబాబా గురించి తెలియంది కాదు. కోట్లాది మంది భక్తులు ఆయనకి ఉన్నారు. అలాంటి స్వామి గురించి ఇప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా తెలియజేయాలనే సంకల్పంతో 'శ్రీసత్యసాయి అవతారం' పేరుతో సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సారథి స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ వైభవంగా ప్రారంభమైంది. దర్శకుడు సాయిప్రకాష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆయన దర్శకత్వంలో వస్తున్న 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని డాక్టర్ దామోదర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్ నివ్వగా, కె.అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎస్.వి.కష్ణారెడ్డి తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సి.హెచ్. మధన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, నటులు సాయికుమార్, సుమన్, బాబూమోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా పాత్రికేయులతో దర్శకుడు సాయిప్రకాష్ మాట్లాడుతూ, 'బాబాగారికి నాతో పాటు 180 దేశాలలో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదష్టం నాకు దక్కింది. ఈ సినిమాకు దర్శకత్వ అవకాశం నాకు రావడం కూడా ఆయన దయ అనేది నా అభిప్రాయం. స్వామి ఎప్పుడూ అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అని చెపుతూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇందులో ఇమిడి ఉంది. ఇందులో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 400 మంది నటించబోతున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ చేస్తాం. రెండు భాగాలుగా చేయాలనేది మా నిర్మాతల నిర్ణయం. అవసరం అయితే మరిన్ని భాగాలు చేయడానికి కూడా సిద్ధం' అని అన్నారు. ఈ చిత్రానికి
కో - ప్రొడ్యూసర్: గోపీనాథ్‌రెడ్డి.