Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా'. వెంకట్ వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్‌తో పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథ ఇది. యూత్‌కు కావాల్సిన వినోదాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో హీరో సునీల్ వాయిస్ ఓవర్ అందించారు' అని తెలిపారు. 'మేం రిలీజ్ చేసిన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం' అని చిత్ర నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు అన్నారు. చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ, 'మంచి కంటెంట్‌తో రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా వస్తున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది' అని అన్నారు.
'ఈ సినిమా విడుదల రెండు సార్లు పోస్ట్ పోన్ అయినా కూడా నిర్మాతలు భయపడకుండా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఎంతో దైర్యంగా రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని హీరో తేజ్ కూరపాటి చెప్పారు. హీరోయిన్ అఖిల ఆకర్షణ మాట్లాడుతూ, 'ఓ మంచి సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాపై ఉన్న నమ్మకంతో మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా రిలీజ్ చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మన ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా కూడా అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు.