Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ పతాకాలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా, 'పైసా' మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. వైకుంఠ బోను దర్శకుడు. వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ''నిన్నే పెళ్లాడతా' అనే టైటిల్ వినగానే గుర్తొచ్చే పేరు నాగార్జున. ఆయన ఇప్పటికే మాకు ఆశీస్సులు అందించారు. చిత్ర ఫస్ట్ లుక్ ఆయన చేతులు మీదుగా విడుదల చేశాం. దర్శకుడు వైకుంఠ బోను మాకు చెప్పిన కథను చెప్పినట్టుగా చాలా చక్కగా తెరకెక్కించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ నెల 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
'సాయి కుమార్ ఈ సినిమాకు చాలా హెల్ప్ చేశారు. సినిమా డైలాగ్స్, మేకింగ్స్ బాగుంటాయి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని దర్శకుడు వైకుంఠ బోను తెలిపారు.
హీరో అమన్ మాట్లాడుతూ, 'మేం విడుదల చేసిన ట్రైలర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయికుమార్‌తో నటించడం మొదట భయమేసినా ఆయనెంతో సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాకు నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని చెప్పారు.
కో ప్రొడ్యూసర్ సాయి కిరణ్ కోనేరి మాట్లాడుతూ,'చిన్నప్పటి నుండి సాయి కుమార్ సినిమాలు చూసి పెరిగిన నేను ఇప్పుడు ఆయనతో స్క్రీన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాను. హీరో అమన్ చాలా బాగా నటించాడు. డైరెక్టర్ ఈ కథను చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు' అని తెలిపారు.