Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో కౌసిక్ వర్మ ఇచ్చిన శాపం ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ 'కౌశిక వర్మ దమయంతి'. వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్ పతాకంపై విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రారు, రఘు దీప్ నటీనటులుగా సుధీర్, విశ్వజిత్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా ఈ చిత్రంలో హేమచంద్ర పాడిన 'పదరా పదరా వేటకు వెళ్దాం' పాటను నిర్మాత సి. కళ్యాణ్ చేతుల మీదుగా మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాకు యస్.యస్ ఆత్రేయ మంచి మ్యూజిక్ ఇచ్చారు. హేమచంద్ర పాడిన ఈ పాట చాలా బాగుంది. విశ్వజిత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చాలా కష్టపడి తీశారు' అని తెలిపారు.
చిత్ర హీరో, నిర్మాత విశ్వజిత్ మాట్లాడుతూ, 'సినిమా బాగా వచ్చింది. 200 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, ప్రెజెంట్ స్టోరీలతో తెరకెక్కిన ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఉన్న నాలుగు పాటలు చాలా బాగుంటాయి. 200 ఇయర్స్ బ్యాక్‌లో సాగే సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి చాలా బాగుందని మెచ్చుకుని 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు' అని అన్నారు.
దర్శకుడు సుధీర్ మాట్లాడుతూ,' ఇలాంటి మంచి హిస్టరికల్ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన హీరో, నిర్మాత విశ్వజిత్కి కృతజ్ఞతలు. త్వరలోనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం' అని చెప్పారు.