Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల విడుదలైన 'స్వాతిముత్యం'తో ఆకట్టుకున్న హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాగా ''నేను స్టూడెంట్ సార్!' అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా వస్తున్న చిత్రమిది. తొలి చిత్రం 'నాంది' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథ అందించారు. ఇటివలే ఈ చిత్రానికి సంబధించిన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో గణేష్ టెర్రిఫిక్‌గా కనిపించారు.
తాజాగా అవంతిక దస్సానిని ఈ చిత్రంలో హీరోయిన్గా పరిచయం చేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు శృతి వాసుదేవన్. అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ సినిమాతో అరంగేట్రం చేస్తోంది.
ఫస్ట్‌లుక్‌లో స్టైలిష్‌గా, క్యూట్‌గా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి సాయితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి, నిర్మాత: 'నాంది' సతీష్ వర్మ, సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ: అనిత్ మధాడి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కథ: కృష్ణ చైతన్య, డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి, కొరియోగ్రఫీ: రఘు మాస్టర్, ఫైట్స్: రామకృష్ణన్.