Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'నిన్నే చూస్తు'. కె.గోవర్ధనరావు దర్శకుడు. పోతిరెడ్డి హేమలతా రెడ్డి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈ చిత్ర ఆడియోను సంగీత దర్శకుడు మణిశర్మ విడుదల చేశారు. ఆడియో జూక్ బాక్స్‌ను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు.
నిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ, 'మా చిత్ర ఆడియోను మణిశర్మ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు, ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
సీనియర్ నటులు సుమన్, సుహాసిని, భానుచందర్, షాయాజీ షిండే సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. దర్శకుడు ఈ కథను చాలా బాగా తెరాకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ రాథోడ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న ఆరు డిఫరెంట్ పాటలు అందర్నీ విశేషంగా అలరిస్తాయి. ఈ నెల 21న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, చివరి వారంలో మా సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపారు.
'ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే ప్రేమకథా చిత్రమిది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. దీనకి దర్శకత్వం చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు' అని దర్శకుడు కె గోవర్ధనరావు చెప్పారు.