Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం 'క్రేజీ ఫెలో'. దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ కథానాయికలు. ఈనెల 14న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో దర్శకుడు ఫణి కృష్ణ మీడియాతో పలు విశేషాలను షేర్చేసుకున్నారు.
'పదేళ్ళుగా ఇండిస్టీలో ఉన్నాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశాను. కొన్ని చిన్న సినిమాలకు పని చేశాను. కళ్యాణ్ కృష్ణ దగ్గర రచనా విభాగంలో కూడా చేశాను. ఈ కథ నిర్మాత రాధమోహన్కి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ పైకి రావడం అనందంగా ఉంది. ఇదొక క్యారెక్టర్ బేస్డ్ మూవీ. హీరో పాత్రని చాలా క్రేజీగా డిజైన్ చేశాం. చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే ప్రాబ్లమ్స్‌ని హిలేరియస్‌గా చూపించాం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చిరునవ్వుతో బయటికి వస్తారు. ఆది ఇందులో కొత్తగా ఉంటారు. ఆయన నటన కూడా కొత్తగా ఉంటుంది. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఇందులో యాక్షన్ కూడా ఉంది. అయితే ఇందులో విలన్ కూడా హీరోనే. అతని వలన అతనికే సమస్యలొస్తాయి. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. వినోదిని వైద్యనాథన్, అనీష్ కురివిల్లా, నర్రా శ్రీనివాస్, సప్తగిరి కీలక పాత్రలు చేశారు. ఈ పాత్రలన్ని చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు మంచి సినిమా చుశామనే ఫీలింగ్‌తో బయటికి వస్తారు. ఆది గారికి ఖచ్చితంగా విజయం వస్తుందని నమ్ముతున్నాను' అని ఫణికృష్ణ చెప్పారు.