Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, 'బెల్ బాటమ్' ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం 'బనారస్'తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.
మీడియా సమావేశంలో హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ, ''బనారస్' మిస్టీరియస్, మెచ్చ్యూర్డ్ లవ్ స్టొరీ. యాక్షన్, కామెడీ, థ్రిల్, సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది' అని తెలిపారు. 'ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోహిస్తున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది' అని నాయిక సోనాల్ మాంటెరో చెప్పారు. సతీష్ వర్మ మాట్లాడుతూ, 'బలమైన కంటెంట్ ఉన్న చిత్రమిది. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నవంబర్ 4న సినిమా విడుదల చేస్తున్నాం' అని అన్నారు.