Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. సోమవారానికి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, 'వనమాలి హౌస్‌లో 'నువ్వే కావాలి' షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. నాలో ఉన్న రచయితను గానీ... దర్శకుడిని గానీ... నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్. ఆయనకు, సీతారామశాస్త్రి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదు. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం'. అటువంటి సీతారామశాస్త్రి దివ్య స్మృతికి నేను, మా చిత్ర బృందం నివాళిగా ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాం' అని తెలిపారు.
'2002లో ఈ సినిమాని స్టార్ట్ చేసి. విడుదల చేశాం. నేను త్రివిక్రమ్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. అతనొక వండర్. మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. త్రివిక్రమ్ చెప్పినట్లు మా చిత్రాన్ని సిరివెన్నెలకు అంకితం ఇస్తున్నాం' అని అన్నారు.