Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హోంబులే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి కాంబినేషన్లో రూపొందిన సినిమా 'కాంతారా'. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించారు. విజరు కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని కన్నడనాట విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయం సాధించింది.
ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. 'కాంతారా' అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈనెల15న ఈ చిత్రం తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి ''కాంతారా'' కచ్చితంగా నచ్చుతుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన 'పుష్ప' సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు వస్తున్న ఈ సినిమాని కూడా చూసి ఎంజారు చేస్తారు. ఫారెస్ట్ బ్యాగ్రౌండ్లో తీయడమే కాకుండా విష్ణుతాత్వాన్ని కూడా బ్యాగ్రౌండ్‌గా చెప్పారు. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళే సినిమా. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా ఇందులో అద్భుతంగా యాక్ట్ చేశాడు. నాయిక సప్తమి గౌడ డీ గ్లామర్ రోల్లో బాగా నటించింది. సుమారు 40 నిముషాల వరకు చూపు పక్కకు తిప్పుకోకుండా సినిమా చూశాను' అని చెప్పారు.