Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాల నిర్మాణంతో అభిరుచిగల నిర్మాతగా కె.కె.రాధామోహన్ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'క్రేజీ ఫెలో'. దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ కథానాయికలు. ఈనెల 14న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత కె.కె.రాధామోహన్ మీడియాతో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
వైవిధ్యమైన ప్రమోషన్
ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు వైవిధ్యమైన ప్రమోషన్స్ చేస్తున్నాం. రెండు వెహికల్స్ తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. ప్రతి చోట ట్రైలర్, సాంగ్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాం. దీనితో పాటు టీవీ కమర్షియల్, పోస్టర్స్, గూగుల్ యాడ్స్ ఇలా.. అన్ని రకాలుగా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాం. ఇది మంచి వినోదం ఉన్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్‌కి బాగానే వస్తారనే నమ్మకం ఉంది.
బలమైన కథ..
ఈ సినిమాలో కథ చాలా బాగుంటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఆది క్యారెక్టర్ చాలా క్రేజీగా కొత్తగా అనిపిస్తుంది. కథానాయికలు దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ ఇద్దరూ చాలా చక్కగా చేశారు. మిర్నా మీనన్‌కి ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్రలో మంచి సర్ప్రైజ్ ఉంటుంది. ఆర్ఆర్ ధ్రువన్ అప్ కమిగింగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐదు పాటలను డిఫరెంట్ వేరియేషన్స్‌లో చేశాడు. ఆర్ఆర్ని కూడా చాలా బ్రిలియంట్‌గా చేశాడు. మ్యూజిక్ విషయంలో చాలా తప్తిగా ఉంది.అలాగే కథలోనూ మంచి క్యూరియాసిటీ ఉంటుంది. ఇది చాలా క్లీన్ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజారు చేసే సినిమా ఇది.
దర్శక, నిర్మాతలకు పెద్ద సవాల్
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన చాలా మారింది. ప్రేక్షకులు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ కంటెంట్ దొరుకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం మాకు సవాల్. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్‌కి వెళ్ళాలా?, ఓటీటీలో చూడాలా? అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక, నిర్మాతలకు ఒక సవాల్.
అప్పుడే ఇండిస్టీలో ఉండగలం
గత మూడేళ్ళుగా 'ఓరేరు బుజ్జిగా, ఓదేల రైల్వే స్టేషన్.. ఇప్పుడు క్రేజీ ఫెలో' చేశాం. స్పీడు పెంచుతూనే రిస్క్‌ని బ్యాలెన్స్ చేస్తేనే ఇండిస్టీలో ఉండగలం. ఇప్పుడు ఇండిస్టీ చాలా ఆర్గనైజ్ద్, కార్పోరేట్ స్టయిల్లో ఉంది. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం ఆయుష్ శర్మతో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను.