Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గాడ్ ఫాదర్'కి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి. సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేమే సొంతంగా విడుదల చేశాం. రెవెన్యూ చాలా స్ట్రాంగ్‌గా ఉంది' అని నిర్మాత ఎన్.వి.ప్రసాద్ చెప్పారు.
చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి.చౌదరి, ఎన్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా వ్రిడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, 'కలెక్షన్స్ మేం ఊహించిన దాని కంటే అద్భుతంగా ఉన్నాయి. 'లూసిఫర్'ని అందరూ చూశారు. ఆ సినిమాని రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్తో పాటు హిందీలో కూడా కలెక్షన్స్ బలంగా ఉన్నాయి. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో 'పోన్నియిన్ సెల్వన్' అద్భుతంగా ఆడుతోంది. అది వారి కల్చర్ మూవీ. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ 'గాడ్ ఫాదర్' రిలీజ్‌ని ఆపుకున్నాం. ఈనెల 14న తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. 'గాడ్ ఫాదర్' లాంటి విజయం ఇండిస్టీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ ఉంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి పండగలాంటి సినిమా ఇది. ఈ సినిమా విజయంపై చిరంజీవి, చరణ్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఓ నిర్మాతగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను' అని అన్నారు.