Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పదేళ్లకు ఒకసారి యూత్ జనరేషన్ మారుతుంటుంది. అందుకే రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోంది' అని దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ అన్నారు.
నితిన్, ప్రియాంక కొఠారి హీరో,హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అడవి'. విశాఖ టాకీస్ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ ఈ సినిమాని విడుదల చేశారు. మళ్ళీ రీ రిలీజ్ సినిమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ, 'జనరేషన్ మారుతున్న ప్రతిసారీ గతంలో వచ్చిన కొన్ని చక్కటి సినిమాలను చూడాలని మారుతున్న యూత్ కోరుకుంటోంది. అప్పట్లో ఎలా తీశారు? ఎందుకు తీశారు?, ఇంకా టెక్నికల్‌గా అప్పడు వచ్చిన అప్డేట్స్ వంటివి చూడాలని మారుతున్న జనరేషన్ ఆశిస్తున్నారు.'అడవి' సినిమానే తీసుకుంటే ఫారెస్ట్ ఫొటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్ వంటివన్నీ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి. అప్పుడు ఎలా ఈ సినిమా హిట్ అయ్యిందో, ఇప్పుడు అంతకుమించి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. 'అడవి' మాదిరిగానే గతంలో నేను చేసిన పలు హిట్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. రైట్స్ ఉన్న ఆయా సినిమాల నిర్మాతలతో సంప్రదించి కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తాను. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌తో కలిసి కొన్ని సినిమాలను రూపొందిస్తాను. ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు' అని చెప్పారు.
'12 ఏళ్ల క్రితం 'అడవి' సినిమాని తెలుగులో నేనే విడుదల చేశాను. అప్పట్లో 3 రోజులపాటు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. బాగా ఆడింది. టెక్నికల్‌గా ఎప్పటికప్పుడు వండర్స్ క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను కూడా చక్కటి విజువల్ ట్రీట్‌గా తెరకెక్కించారు. ప్రస్తుతం దాదాపు వంద థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవలే 'త్రీ' సినిమాను రీ రిలీజ్ చేస్తే, మేం ఊహించినదానికంటే చాలా గొప్ప స్పందన రావడం మాకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ప్రేరణతోనే ఈ నెల 15న ప్రభాస్ నటించిన 'రెబల్' సినిమాను, ఈ నెల 22న 'వర్షం' చిత్రాన్ని మా సంస్థ తరపున రీ-రిలీజ్ చేయబోతున్నాను. అలాగే రామ్ గోపాల్ వర్మతో కలిసి కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నాం. రామ్ గోపాల్ వర్మ, నేను పాతికేళ్లుగా మంచి స్నేహితులం. కొద్దికాలం క్రితం మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు సమసిపోయాయి. అప్పట్లో వివాదపరంగా ఎమోషనల్‌గా అన్న మాటలకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నాను. మళ్ళీ ఆయనతో కలిసి అనేక సినిమాలు చేయాలని అనుకుంటున్నాం' అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తెలిపారు.