Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రేజీ ఫెలో'. కె.కె.రాధామోహన్ నిర్మాత. దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ కథానాయికలు. నేడు (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో ఆది సాయికుమార్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
అందరికీ నచ్చే కథ
చాలా మంచి ఎంటర్టైనర్. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నారు. అంతే నీట్‌గా ప్రజెంట్ చేశాడు. కామెడీ ఆర్గానిక్‌గా ఉంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. నిర్మాత కె.కె.రాధామోహన్‌కి కూడా కథ చాలా బాగా నచ్చి, సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమాలో మంచి మ్యాజిక్ ఉంది.
కష్టాలు కొని తెచ్చుకునే పాత్ర
ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే క్యారెక్టర్. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ అద్భుతంగా చేశారు. దిగంగన సూర్యవంశీకి మంచి పేరు వస్తుంది. ఆమె మంచి డ్యాన్సర్. అలాగే మిర్నా కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్ర కూడా బాగుంటుంది. ఆర్ఆర్ ధ్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ బాగుంటాయి. తను మంచి లిరిక్ రైటర్ కూడా. చాలా హార్డ్ వర్క్ చేసి మంచి ఆల్బమ్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని పది మందికి చెప్పుకునేలా ఉంటుంది. ప్రస్తుతం 'టాప్ గేర్' అనే థ్రిల్లర్, మరో క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు 'పులి మేక' అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా.