Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'ఎన్నికల సమయంలో చేసిన వాగ్థానాల్లో 90 పూర్తి చేశాను. ప్రతి సభ్యుడికి నటించే అవకాశాలు రావాలనే లక్ష్యంతో నటీ నటుల జాబితాతో చేసిన పుస్తకాన్ని ప్రతి నిర్మాతకి, దర్శకుడికి పంపించాం. అలాగే సోషల్ మీడియా యాప్ రెడీ చేస్తున్నాం. 'మా' మహిళల రక్షణ కోసం సునీతా కష్ణన్ని అడ్వైజర్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశాం. మెంబర్షిప్ విషయంలో నిబంధనలు మరింత కఠినతరం చేశాం. అర్హులైన వాళ్ళకి 6వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 'మా' గురించి సభ్యులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సభ్యత్వం రద్దు చేస్తాం. 'మా' బిల్డింగ్ 6 నెలల్లో సిద్ధం అవుతుంది. 'మా' సభ్యులందరికి మెడికల్ సపోర్ట్ ఇచ్చాం. ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. వేరే కంట్రీలో చేసే ఈ ఈవెంట్ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మా సభ్యులకి ఎడ్యుకేషన్ ఫీజులో కూడా రాయితీ ఇస్తుంది. మోహన్‌బాబు యూనివర్సిటీలో సినిమా ఇండిస్టీలో పని చేసే ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తున్నారు' అని తెలిపారు.