Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్ కావడం విశేషం.
తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ని ప్రకటించారు నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా నటించనుంది. ఇది ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది. ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తిరు'తో సహా మరికొన్ని తమిళ చిత్రాలలో ఆమె నటించారు. నాయిక ఎనౌన్స్మెంట్ పోస్టర్‌పై ఉన్న వస్తువులను పరిశీలిస్తే టేప్, కట్టర్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రియా ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా మెరవబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. సత్యదేవ్, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి, తమకంటూ ఒక మార్క్‌ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్, అడిషినల్ స్క్రీన్ ప్లే: యువ, నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం,
డీవోపీ: మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం: చరణ్ రాజ్, ఎడిటర్: అనిల్ క్రిష్, డైలాగ్స్: మీరాఖ్, స్టంట్స్ : సుబ్బు, కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు.