Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా 'మది'. ఆర్.వి.రెడ్డి సమర్పణలో ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుఆ విచ్చేసిన సుమన్, ఆమని చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మండలి శాసన సభ్యులు దయానంద్ గుప్త, కిరణ్, బి.సి.కమీషన్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ గోవర్ధన్ రెడ్డి, నటి నవీన రెడ్డి, దర్శకుడు జై శంకర్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ ధనుష్ మాట్లాడుతూ, 'రొమాంటిక్ లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ఉంటూ, వినూత్నరీతిలో ఉంటుంది. సినిమా రిలీజ్ టైమ్‌లో ఆర్.వి.రెడ్డి మాకు సపోర్ట్‌గా రావడం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.
'డైరెక్టర్ నాగ ధనుష్ చేసిన షార్ట్ ఫిల్మ్‌తో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీశాం. ఆర్టిస్ట్‌గా అవుదామని వచ్చిన నేను నా ఫ్రెండ్ బాధ చూడలేక నిర్మాతగా మారాను. అలాగే మాకు సపోర్ట్‌గా నిలిచిన ఆర్.వి.రెడ్డికి ధన్యవాదములు. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్‌గా నిలుస్తుంది. సందర్భానుసారంగా ఈ సినిమాలో వచ్చే ఐదు సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి వీటిని అద్భుతంగా పాడారు. మంచి కంటెంట్‌తో వస్తున్న మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని కచ్చితంగా చెప్పగలను' అని నిర్మాత రామ్‌కిషన్ అన్నారు.
కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 'ప్రస్తుత యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేటటువంటి అద్భుతమైన కథను దర్శకుడు నాగ ధనుష్ చాలా ఎఫర్ట్ పెట్టి తెరకెక్కించాడు. సినిమా చూశాం. చాలా బాగుంది. ఓ సరికొత్త కంటెంట్‌తో వస్తున్న మా చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.