Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అగ్ర కథానాయకుడు వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా ఈనెల 21న విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. పీవీపీ సంస్థ ఎప్పుడూ మంచి చిత్రాలను నిర్మిస్తుంటుంది. అశ్వత్ ఒరిజినల్ సినిమాను చూడలేదు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. వెంకటేష్ చేసిన రోల్ చాలా ఇంపాక్ట్‌గా ఉంది. వెంకటేష్ అన్న కోసమైనా ఈ చిత్రం చూస్తాను. మిథిలా పాల్కర్‌కు నేను, నా భార్య అభిమానులం. ఆమె ఓటీటీ సూపర్ స్టార్. ఆశాకు ఆల్ ది బెస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో విశ్వక్ సేనుడి గురించి తెలియని వారులేరు. ఆయనకు అంతటా అభిమానులున్నారు. ఆయన పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని. ఇచ్చిన మాట కోసం నిలబడే వారంటే నాకు ఇష్టం. మంచో, చెడో.. మాట ఇస్తే.. విశ్వక్ సేన్ నిలబడతాడు. ఈ దీపావళికి ఈ సినిమా బాగుంటుందా?, ఈ సినిమా వల్ల దీపావళి బాగుంటుందా? నాకు తెలియదు గానీ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలి' అని అన్నారు.
'రామ్ చరణ్‌లా ఎంతో క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాను. ఇది నా లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటాను. 'ఫలక్‌నుమా దాస్' సినిమా కోసం నాని వచ్చాడు. ఆ సినిమా ట్రైలర్‌ను వెంకటేష్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో దేవుడి పాత్రను ఆయన చేశారు. అశ్వత్ అద్భుతమైన కథ రాశాడు. వంశీ కాక మున్ముందు కూడా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలి' అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక మాట్లాడుతూ, 'సాయం చేసిన వాడు దేవుడు. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా దేవుడు రామ్ చరణ్‌కి చాలా థ్యాంక్స్' అని తెలిపారు.