Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తెలిసిన వాళ్ళు'. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ కలిసిన ఒక కొత్త తరహా కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా, ఆయన సరసన హేబా పటేల్ నాయికగా నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
'ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన 'శశివదనే' పాటకు మంచి స్పందన లభించింది. అలానే ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్ర టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ చూసిన కొంతమంది ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ చిత్ర విజయంపై మేకర్స్ మంచి నమ్మకంతో ఉన్నారు. పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా కచ్చితంగా ఉంటుంది. నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో సెన్సార్ పనులు కూడా పూర్తి చేస్తారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసుకుందుకు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత : విప్లవ్ కోనేటి, సినిమాటోగ్రఫీ: అజరు.వి నాగ్, అనంత్ నాగ్ కావూరి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల, లిరిక్స్: డాక్టర్ జివాగో, ఆర్ట్: ఉపేందర్ రెడ్డి, కొరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, ఫైట్స్: సిహెచ్ రామకృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ.