Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'జిన్నా'. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను కోన వెంకట్ అందించారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్. దీపావళి సందర్భంగా ఈనెల 21న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, 'ఈ మూవీ అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని, సాధిస్తుందని భావిస్తున్నాను. 'ఢీ' తర్వాత 10 రెట్లు సక్సెస్ సాధించాలి' అని చెప్పారు.
''జిన్నా' నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే సినిమా. నా కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్‌ని, అలాగే నా తనయలు ఆరియానా, వివియానా ఈ సినిమాలో తొలిసారి పాడే అవకాశాన్ని ఇచ్చిన అనూప్‌కి, డైరెక్టర్ సూర్యకు థ్యాంక్స్' అని హీరో విష్ణు మంచు అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ, 'దీన్ని సినిమా అనటం కంటే, మా మోహన్‌బాబు అన్నయ్య నాపై పెట్టిన బాధ్యత. ఈ సినిమా విష్ణు కెరీర్‌కి గొప్ప సెకండ్ ఇన్నింగ్స్ సినిమా అవుతుంది' అని తెలిపారు.
'ఈ సినిమా కలలాగా స్పీడుగా అయ్యింది. ప్రతిదీ సర్ప్రైజ్. తొలి రోజు నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఓ ప్రశ్న కూడా వేయకుండా మోహన్ బాబు నా వెంటే ఉండి సపోర్ట్ చేశారు. విష్ణు పిల్లలు ఆరియానా, వివియానా పాట పాడారు. ఆ పాట సూపర్ సక్సెస్ అయ్యింది. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ అద్బుతంగా నటించారు. సన్నీలియోన్ బెస్ట్ సర్ప్రైజ్. ఇక జిన్నాగా విష్ణు అదరగొట్టేశారు' అని దర్శకుడు ఈషాన్ సూర్య చెప్పారు.
జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'రషెష్ చూశాను. సినిమా బ్లాక్ బస్టర్. త్వరలోనే జిన్నా బ్లాక్ బస్టర్ జాతర జరుగుతుంది' అని అన్నారు.