Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ఎన్.రావు, యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వెల్కమ్ టు తీహార్ కాలేజ్'.
ఈ చిత్ర ట్రైలర్‌ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎల్.ఎన్.రావు మాట్లాడుతూ,'సునీల్ కుమార్ రెడ్డి మార్క్ ప్రతి సినిమాలో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన తన ప్రత్యేకతను కనబరిచారు ఈ సినిమాను ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. 'విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల కోసం, ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం చేసిన ప్రయత్నమే మా సినిమా' అని మరో నిర్మాత బాపిరాజు చెప్పారు. దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,'బతకడానికి ధైర్యం ఇవ్వాల్సిన చదువే చావడానికి కారణం అవుతోంది. ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టం ఎంత ఫెయిల్యూర్లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా చూసి ఏ ఒక్క స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేయకుండా, తన భవిష్యత్తు, తన కుటుంబం, తన మనోధైర్యాన్ని నిలబెట్టుకోవాలి. మా సినిమాను విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు తప్పకుండా చూసి, ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.
హీరో మనోజ్ నందన్ మాట్లాడుతూ, 'నా కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఇది. ఈ సినిమా కోసం చాలామంది స్టూడెంట్స్ దగ్గర ప్రాక్టికల్ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుని, ఆ అంశాల్ని సినిమాలో చూపించాం. ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని, అలాగే ప్రైవేటు రంగంలో చేస్తున్న మోసాల గురించి చర్చించాం' అని చెప్పారు. 'నేను ఇంటర్ చదివే టైమ్‌లో నేను ఫేస్ చేసిన అనేక సంఘటనలు ఈ సినిమాలో డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి చూపించారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని హీరోయిన్ సోనీ రెడ్డి అన్నారు.