Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తి, 'అభిమన్యుడు' ఫేమ్ పి.ఎస్.మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా ఈనెల 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పి.ఎస్్ మిత్రన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
'సర్దార్' ఎలా మొదలైంది ?
- నా తొలి చిత్రం 'అభిమన్యుడు' డబ్బింగ్ చేస్తున్నప్పుడే 'సర్దార్' ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో నా ఐడియాని షేర్ చేసి, దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్‌కి ఈ కథ చెప్పాను. ఆయన కార్తిని కలవమన్నారు. కార్తికి 'సర్దార్' ఐడియా చాలా బాగా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని గ్రీన్‌సిగల్ ఇచ్చారు.
ఇది పీరియడ్ సినిమానా?
- వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక స్పై (గూఢచారి)ని తయారు చేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది వాస్తవంగా జరిగింది. ఈ సంఘటనే 'సర్దార్' కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యథార్థ కథ కాదు.
కార్తి ద్విపాత్రాభినయం గురించి?
- ఇందులో కార్తి పాత్ర చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా ఆయన కనిపిస్తారు. ఒకరి పాత్రకు, మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం ఉంటుంది. 'గూఢచారి' పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
కార్తితో పని చేయడం ఎలా అనిపించింది ?
- నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలను పంచుకుంటారు. ఆయన తాజా చిత్రం 'పిఎస్ 1' ఘన విజయం సాధించింది. మా 'సర్దార్' ఈ విజయాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే అన్ని రుచులు ఉన్న ఫుల్ మీల్స్ లాంటి సినిమా. లవ్, కామెడీ, యాక్షన్, బలమైన ఎమోషన్, సోషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.
కథానాయికల పాత్రల తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
- రాశి ఖన్నా, రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. వారు తమ పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఈ సినిమాకి సంగీతం ఎంతవరకు హెల్ప్ అవుతుంది?
- జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన బెస్ట్ స్కోర్స్‌లో 'సర్దార్' ఒకటి. కథకు తగ్గ పాటలను చాలా ఎక్స్టార్డినరీగా చేశారు. నేపథ్య సంగీతం కూడా బ్రిలియంట్‌గా ఉంటుంది.
ఈ సినిమా తర్వాత అఖిల్‌తో ఒక సినిమా చేసే ఆలోచన ఉంది.